రామాయణం బేస్ కథ. రావణాసురుడిలాంటి ఓ వ్యక్తిని పట్టే క్రమంలో అతని చెల్లెల్ని పోలీసు అధికారి మట్టుబెడతాడు. దాంతో కోపోద్రిక్తుడైన "విలన్" ఆ పోలీసు అధికారి భార్యను తనవద్దే ఉంచుకుంటాడు.
బిజినెస్ టెక్నిక్‌ను ఉపయోగించి దర్శకుడు మణిరత్నం రామాయణానికి, విలన్‌కు సంబంధంలేదని పలుసార్లు స్టేట్‌మెంట్లు ఇచ్చి, ఇదేదో కొత్త కథనే భ్రమకల్పించాడు. అసలు రామాయణానికి సంబంధమేలేదని చెబుతూ పేరు మాత్రం రావణ్స రావణన్, విలన్ అంటూ మూడు భాషల్లో ఆర్టిస్టుల్ని అటూఇటూ మార్చి తీసి కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నాడు.
"చేయితిరిగిన రచయిత ఒకాయన అంటుంటేవాడు.. రాజు, ఏడుచేపల కథే అయినా దాన్ని చెప్పే విధానం కొత్తగా ఉంటే.. ఎన్ని సినిమాలైనా తీయవచ్చునని". అది తెలిసిన మణిరత్నం చేసిన ప్రయోగమే విలన్. మొదటి భాగం సప్పగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రెండో భాగంలో కాస్త ఆసక్తి కలుగజేశాడు. పేరు పొందిన నటీనటులు
Page(s):1 2 3 4