హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ మరో ఆరు నెలల్లో ఆధార్ కార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 8 కోట్ల 46 లక్షల మంది రాష్ట్ర ప్రజలకు యూనిక్ ఐడెంటిడీ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం శాసనసభలో స్పష్టం చేశారు. ఆధార్ కార్డునే రేషన్ కార్డుగా, మల్టిఫుల్ కార్డుగా ఉపయోగించేందుకు కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు.