బాలీవుడ్ తెరపైకి ఓ కొత్త ఖాన్ రాబోతున్నాడు. అతను షారూక్‌ఖాన్ కొడుకు ఆర్యన్ అని బాలీవుడ్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆర్యన్ వయసు 12ఏళ్లు తండ్రి షారూక్‌ఖాన్‌తో నటించడానికి ఓ సినిమా ఆఫర్ వచ్చింది. నేటి యువతరంగం పరిస్థుతలు గురించిన కథనంతో సినిమా తెరకెక్కనుంది. చిత్ర నిర్మాతలు ఇందులో షారూక్, కొడుకు ఆర్యన్ ఇద్దరూ కలిసి నటించాలని కోరారంట. బాలీవుడ్ తెరకు ఆర్యన్ కొత్తవాడేం కాదు. 'కభీ ఖుషీ కభీ గమ్' చిత్రంలో మాస్టర్ షారూక్‌గా ఆర్యన్ నటించాడు. అసలు విషయమేమంటే...ఈసారి వస్తున్న ఆఫర్ బిగ్ రోల్. దీనికి షారూక్ అనుమతిస్తాడా అనేది ఇండిస్టీ టాక్!
Page(s):1