పపంచకప్ మరెంతో దూరం లేదు. ఆరు మాసాల వ్యవధి మాత్రమే ఉంది. నెంబర్ వన్ కిరీటం ధరించి పొంగి పోతున్న భారత జట్టు ఎంత బలహీనంగా ఉందో శ్రీలంకలో మన జట్టు ఆటతీరు స్పష్టం చేస్తోంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారిస్తుంటే వారిని అవుట్ చేయడం కాదుకదా, కనీసం నియంత్రించడం కూడా మన బౌలర్లకు చేతకావడం లేదు. గాలే టెస్టులో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు తాతలు దిగివచ్చారు. రెండో టెస్టులోనూ అదే ప్రహసనం కొనసాగుతోంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్, ముఖ్యంగా పరణవితన, సంగక్కర జోరుకు అడ్డుకట్ట వేసే నాథుడే కనిపించ డం లేదు. ఇరువురూ వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేసారు. సంగక్కర అయితే కేవలం 335 బంతుల్లో 219 పరుగులు చేసి భారత్ బౌలింగ్‌లోని బలహీనతలను చాటిచెప్పాడు. ఇది చాల దన్నట్లు జయవర్ధనే కూడా డబుల్ సెంచరీకి చేరువై భారత్‌ను నిస్పృహలోకి నెట్టాడు. సమరవీర కూడా భారత్‌పై ఏమాత్రం కనికరం చూపలేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసాడు కానీ అతడు కూడా సెంచరీ చేసేవాడే. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు నమోదయ్యాయి.
భారత్ బౌలింగ్ మున్నెన్నడూ లేనంత బలహీనంగా ఉంది. ఇషాంత్ శర్మకానీ, అభిమన్యు మిథున్ కానీ శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోతున్నారు. స్పిన్నర్లు కూడా
Page(s):1 2 3