''వానల్లు కురవాలి, కామన్వెల్త్ గేమ్స్ అందులో కొట్టుకుపోవాలి'' అని కేంద్ర మాజీ మంత్రివర్యులు మణిశంకర్ అయ్యర్ కోరుకుంటున్నారు. మీరు నిజమే చదువుతున్నారు. మీ కళ్లు మిమ్ములను మోసం చేయడం లేదు. అక్టోబర్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ విజయవంతమైతే తాను బాధపడతానని, దుష్టశక్తి మాత్రమే ఆ క్రీడోత్సవాలను ఆదరిస్తుందని ఆయన నోరు పారేసుకున్నారు. వర్షాలు వచ్చి కామన్వెల్త్ గేమ్స్‌కు ఇబ్బందులు ఎదురైతే తాను సంతోషిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడోత్సవం విజయవంతమైతే అంతటితో ఆగదని, ఆసియన్ గేమ్స్, ఒలింపిక్స్ మొదలైనవి మన దేశంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని ఇంతకుముందు క్రీడాశాఖా మంత్రిగా ఉన్న మణిశంకర్ అయ్యర్ ఆందోళన చెందుతున్నారు. ఆయన దృష్టిలో అక్టోబర్‌లో జరగనున్న ఈ పోటీలకు భారీ మొత్తంలో ఖర్చుచెయ్యడం దండుగమారిపని. క్రీడోత్సవాలపట్ల అయ్యర్ అక్కసు వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా తన అభిప్రాయాలను ఇదే రీతిలో వ్యక్తం చేసారు. కామన్వెల్త్‌గేమ్స్‌కు అయ్యే 35 వేల కోట్ల రూపాయలను బాలల సంక్షేమం కోసం ఖర్చుచెయ్యవచ్చునని ఆయన సలహా ఇచ్చారు. బాలలు మౌలిక వసతులు కరువై వెతలకు గురవుతుంటే ఇంత పెద్దమొత్తంలో క్రీడోత్సవాలకు ఖర్చుచెయ్యడం అవసరమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలను తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆ పార్టీ ఎంపి సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు.అయ్యర్ వ్యాఖ్యలు జాతి
Page(s):1 2