లండన్ : అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా యుద్ధానికి సంబంధించి వేలాది రహస్య పత్రాలను విడుదల చేసిన 'వికిలీక్స్.ఓఆర్‌జీ' వెబ్‌సైట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన మొదలైంది. భారత్, పాకిస్తాన్‌లలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయాన్ని కూడా బయటపెట్టి వెబ్‌సైట్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వికిలీక్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికా మిలిటరీ చరిత్రలోనే ఈ లీకేజీ అతిపెద్దదిగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదస్పద అంశంతో ధీర్ఘకాలికంగా వికిలీక్స్ వీక్షకులను అలరించకపోనప్పటికీ, పలు అవార్డులను గెలుచుకోగలదని టెలిగ్రాఫ్ వార్తాపత్రిక పేర్కొంది. అబూ గ్రాయిబ్ జైలులో ఖైదీల పట్ల జరుగుతున్న అకృత్యాలు, సారాపాలిన్ ప్రైవేట్ ఈ-మెయిళ్లను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
2007 జనవరిలో అస్ట్రేలియాకు చెందిన జులియన్ అసాంజె స్వీడన్ నుంచి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్‌లో వివిధ విభాగాలకు చెందిన 12లక్షల రహస్య పత్రాలను అందులో పొందుపరిచారు. వికిలీక్స్‌లోని సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెబ్ యూజర్లు చూసి చర్చజరగాలనేది తన అభిమతమని అసాంజె పేర్కొన్నారు. ఆసియా, మాజీ సోవియెట్ బ్లాక్ సబ్ సహారన్ ఆఫ్రికాలోని అణచివేత ధోరణులను ప్రపంచానికి చాటి సమాజానికి మేలు చేయడమే లక్ష్యం అన్నారు.
మరోవైపు వివిధ దేశాలకు చెందిన రహస్య సమాచారం వికీలీక్స్ చేరిపోతుండడంతో ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా అస్ట్రేలియా, చైనా తదితర దేశాలు
Page(s):1 2