ఇప్పటివరకూ మీసాలు, గెడ్డాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ హీరోలు ఇప్పుడిప్పుడు మీసాలపై మోజు పెంచుకుంటున్నారు. అడపాదడపా మీసాలతో సినిమాల్లో నటిస్తున్నారు. మేము సైతం 'మీసాల్' మెలేస్తామంటున్నారు!
దబంగ్' అనే చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్న సల్మాన్‌ఖాన్ ఆ చిత్రంలో మీసాలతో నటిస్తున్నాడు. అలాగే.. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్' అనే చిత్రంలో అజయ్‌దేవగన్‌తోపాటు, సీరియల్ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్‌హష్మి కూడా మీసాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. అదేవిధంగా.. రాంగోపాల్‌వర్మ రూపొందిస్తున్న 'రక్త చరిత్ర'లో పరిటాల రవి పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబరాయ్ కూడా మీసాలు మెలేస్తున్నాడు. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడొక్కసారిగా మొదలైంది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా హిందీ హీరోలు పలు చిత్రాలలో మీసాలతో నటిస్తూనే ఉన్నారు. మణిరత్నం తాజా చిత్రం 'రావణ్'లో అభిషేక్‌బచ్చన్, 'మంగళ్‌పాండే'లో అమీర్‌ఖాన్, 'చాందిని చౌక్'లో అక్షయ్‌కుమార్, 'జోధా అక్బర్'లో హృతిక్‌రోషన్, 'రబ్ నే బనాది జోడి'లో షారుక్‌ఖాన్ మీసాలతో నటించారు. కాబట్టి ముందుముందు మరికొందరు బాలీవుడ్ హీరోల్ని కూడా మనం మీసాలతో చూడొచ్చన్నమాట!
Page(s):1