ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చిచ్చురేపాయి. ఒక్కటి మినహా మిగిలిన 11 స్థానాలూ రాజీనామా చేసిన వారికే వస్తాయంటూ సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు, ఆమేరకు ఆయన చేయించిన సర్వేలపై తెలంగాణ మంత్రులు, సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. ఉపఎన్నికల్లో పార్టీ ఓడితే.. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి కోసమే లగడపాటి వ్యూహ రచన చేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన సర్వేలను సాకుగా చూపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు.. వైఎస్ లేని లోటు ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని బహిష్కృత నేత అంబటి రాంబాబు మరో బాంబు పేల్చారు. వైఎస్ జీవించి ఉంటే ప్రచారానికి వెళ్లేవారంటూ పరోక్షంగా రోశయ్య అధైర్యాన్ని, అసహాయతనూ ఎత్తిపొడిచారు.
జగన్ ప్రచారానికి వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, ఇప్పుడు పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదంటూ ఘాటుగా స్పందించడం కూడా కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. వీరిద్దరూ ఉప ఎన్నికల ఫలితాలపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఫలితాలను వేదికగా చేసుకుని, జగన్ వర్గం కూడా ముందస్తుగా రోశయ్యను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధపడుతుండటం ఆసక్తికరంగా మారింది.
లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు ఉప ఎన్నికల్లో తాము పడ్డ కష్టాన్ని,
Page(s):1 2 3 4 5