రామ్-జెనీలియా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మొదలై 'రామ్ అండ్ జెన్నీ' అనే టైటిల్ ఖరారు చేయబడిన చిత్రం ఆగిపోయిందని తెలుస్తోంది. 'కిక్' అనం తరం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్-జెనీలియా జంటగా ప్రముఖ నిర్మాత, హీరో రామ్ కు పెదనాన్న కూడా అయిన 'స్రవంతి'రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించదలిచారు. చిత్ర ప్రారంభోత్సవం కూడా భారీ ఎత్తున నిర్వహించారు. అయితే, స్క్రిప్ట్ సంతృప్తి కరంగా షేప్ దాల్చనందున హీరో రామ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేసారని తెలుస్తోంది!
టాలీవుడ్‌పై కన్నేసింది !
అరుణాషీల్డ్‌స...ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వీస్తున్న వేడి గాలి. 'ప్రిన్స్' చిత్రం లో మాయగా నటించి యువ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన ఈ భామ అవడానికి భారత సంతతే అయినా పెరిగిందంతా బ్రిటన్ లోనే. లేటెస్ట్ చిత్రం 'మిస్టర్ సింగ్, మిసెస్ మెహతా' చిత్రంలో దాదాపు నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో భర్త నిర్లక్ష్యానికి గురైన భార్యగా.. భార్య వదిలేసిన ఓ భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. పాత్రపరంగా అతడొక పెయింటర్. అందుకని అరుణాషీల్డ్‌స ఒక సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి వచ్చింది.అందుకు ఆమె ఏమీ అభ్యంతరం చెప్ప పోగా. ఆ సినిమా తర్వాత కూడా అవసరం మేరకు నగ్నంగా నటించేందుకు తనకు అభ్యంతరం లేదంటోంది. ఈ విషయంలో 'కైట్స్'లో నటించిన
Page(s):1 2