ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి సమర్పణలో వెంకట్ నిర్మాతగా రూపొందుతున్న 'డాన్ శీను' చిత్రీకరణ పూర్తయింది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. రవితేజ-శ్రీయ జంటగా నటిస్తున్నారు. శ్రీహరి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ మరో సారి ఈ చిత్రంతో ప్రతినాయకునిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో తుది చిత్రీకరణ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకులు కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'ఆగస్టు తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆదిత్యా ద్వారా ఇటీవల విడుదలైన పాటలు ఘన విజయం సాధించాయి.
'కిక్'తర్వాత ఆస్థాయి వినోదాత్మక చిత్రమిది. శ్రీహరి 'డాన్ శీను'కి సరిజోడు అనిపించే పాత్రలో నటించారు. సినిమా నాణ్యంగా రావడానికి సహనిర్మాత సురేష్‌రెడ్డి బాగా కృషిచేశారు. ఛాయాగ్రాహ కుడు సమీర్ రెడ్డి, రచయిత కోనవెంకట్ సినిమాకు మూల స్థంబాలుగా నిలిచారు. ఆలీతో 'హంగామా' నుంచి అను బంధం కొనసాగుతోంది. ఆయన పాత్ర, బ్రహ్మానందం పాత్ర కడుపుబ్బా నవ్విస్తాయి. చిత్రం కోసం కష్టించిన సాంేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు' అన్నారు. శ్రీహరి మాట్లాడుతూ 'మంచి సంస్థలో పనిచేసిన అనుభూతి కలిగింది. సంతృప్తికరమైన పాత్రలో నటించాను. 'ఢీ'లో పాత్ర కంటే మంచి పేరు తెస్తుంది. కథ విన్నప్పుడే సినిమా హిట్ అనిపించింది. కొత్త దర్శకుడు బాగా తీశారు' అన్నారు.
మహేష్ మంజ్రేకర్ మాట్లాడుతూ
Page(s):1 2