ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తే మెరుగైన ఫలితాలు వచ్చేవని ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన పార్టీ నేతలు బాబుకు చెప్పారు. అయితే, మనకు తెలుగువారి సమస్యలే ముఖ్యమయినందున, బాబ్లీపై పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వవలసి వచ్చిందని, దానితో ఉపఎన్నికలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని బాబు చెప్పారు. బుధవారం చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లతో భేటీ అయి, ఉప ఎన్నికల సరళిపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
ప్రచారానికి మీరు వచ్చి ఉంటే కొన్ని సీట్లు ఖాయంగా సాధించేవారమని, పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం వచ్చేదని పార్టీ నేతలు బాబుకు చెప్పారు. బాబ్లీపై చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించి ఉంటే ఫలితాలు మనకే అనుకూలంగా వచ్చేవన్నారు. టీఆర్‌ఎస్ నేతలు ప్రచారానికి వచ్చిన వారిపై రాళ్లే యాలని రెచ్చగొట్టినప్పటికీ, దానిని లెక్కచేయ కుండా గ్రామాల్లో ప్రజలు తమను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పనులేమీ చేయలేదని, అసలు వారు అందు బాటులో కూడా లేరని గ్రామస్థులు చెప్పినట్లు వివరించారు. అయితే తెలంగాణ కోసం వారు రాజీనామా చేసినందున ఆ సానుభూతి ప్రజల్లో ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ, మన పార్టీ శ్రేణులు బాగా పనిచేశారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల
Page(s):1 2