సినీనటి ఆమనిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. వరకట్నం వేధింపులు, రెండవ పెళ్లి చేసుకున్నాడనే కారణంగా సినీనటి ఆమని సోదరుడు శ్రీనివాస్ తల్లి విజయమ్మ, రెండవ భార్య దేవికళలను బుధవారం మహిళా పోలీస్‌స్టేషన్ సిఐ కిషోర్‌బాబు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులో నిందితురాలైన ఆమనిని ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని సిఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మెక్లిన్స్‌రోడ్డు ప్రాంతానికి చెందిన కందుకూరి చెంగయ్యాచారి కుమార్తె లీలావతిని సినీనటి ఆమని సోదరుడు శ్రీనివాస్‌కు ఇచ్చి 1997లో నెల్లూరు నగరంలో వివాహం జరిపించారు.
చెనై్న లో పెట్రోల్ బంకును నిర్వహిస్తున్న శ్రీనివాస్ లీలావతితో పెళ్లైన రెండేళ్ల తర్వాత దేవికళను కూడా వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టాడు. ఈ వ్యవహారం మొదటి భార్య లీలావతికి రెండేళ్ల క్రితం తెలియడంతో వెంటనే ఆమె చెన్నెలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై అక్కడి పోలీసు లు ఇరువురినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అప్పటికే అదనపు కట్నం కోసం వేధింపులకు గురవుతున్న లీలావతికి భర్త , ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు పెరగడంతో స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Page(s):1