పోలవరం ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్రం అనుమతి లభించింది.దీనికి ఎలాంటి షరతులూ లేకపోవడం విశేషం. గతంలో ఈ ప్రాజెక్టు కారణంగా పర్యా వరణానికి నష్టం కలుగుతుందని, దీని ద్వారా గిరిజనులు తమకు లభించే అటవీ లాభాన్ని కోల్పోతాయని విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఈ అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరిం చింది. పోలవరం వద్ద 301 శతకోటి ఘనపుటడుగుల నీటిని నిలువచేసే సామర్ధ్యంతో గోదావరిపై నిర్మించాలనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖలు ఇప్పుడు పచ్చజెండా ఊపాయి.
గోదావరి నదీ జలాల ద్వారా ముంపునకు గురయ్యే అటవీ ప్రాంతం ఎంత అన్న దానిపై నివేదిక, డిజైన్లు, కాంటూర్లు పరిశీలించిన పర్యావరణ విభాగం ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో నీటిని నిలువ చేయడం వల్ల జంతు జాలానికి కానీ, పర్యావరణ పరంగా ఇతరత్రా ఏ ఇబ్బందులూఉండవని స్పష్టం చేసింది. దీంతో 'పోలవరం' నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లైంది.
ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 3 వేల ఏడు వందల హెక్టార్ల విస్తీర్ణంలో 258 హెక్టార్లను అటవీ ప్రాంతంగా గతంలో గుర్తించారు. దీనితో పర్యావరణ అనుమతులకై రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతిపా దనను పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమించిన అటవీశాఖ సలహాదారుల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతులు 2008 లో మొదటి దశకు ఇచ్చింది. పర్యావరణ
Page(s):1 2 3