హైదరాబాద్: హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో గురువారం ఉదయం కారు పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. కారు పడిపోయిన మరుక్షణమే ట్రాఫిక్ పోలీసులు గుర్తించడంతో ప్రమాదం తప్పింది. వారు విద్యార్థులను బయటకు తీశారు. కారును కూడా వెలికి తీశారు. అయితే డ్రైవర్ సీటులో ఉన్న వివేక్ అనే విద్యార్థి పారిపోయాడు. కారు అల్లాడి శ్రీనుదని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు అదుపు తప్పి ఫుట్ పాత్ ను ఢీకొట్టి హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు కూడా వాసవి కళాశాలలో బికాం చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివేక్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద యెత్తున ప్రజలు గుమికూడడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.
Page(s):1