హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తెరాస అధినేత కెసిఆర్, మంత్రి కోమటిరెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెసు అభ్యర్థి షబ్బీర్‌అలీ ఇచ్చిన వివరణలపై ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యతాయుత పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని కెసిఆర్ ను, కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డిని ఇసి మందలించింది.
ఎదుటి పార్టీవారిని విమర్శించే విషయంలో సంయమనం పాటించాలని ఇసి కెసిఆర్ కు సూచించింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని ఇసి కెసిఆర్ కు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు హితబోధ చేసింది. తెలంగాణ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన ప్రసంగాలపై కెసిఆర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీల మీద ఇసికి ఫిర్యాదులు అందాయి.
Page(s):1