•పొంగుతున్న వాగులు
•పలుచోట్ల రాకపోకల స్తంభన
తెలంగాణ, రాయలసీమ జిల్లాలను గురువారం వర్షం ముంచెత్తింది. గత మూడు రోజులుగా కురుసోన్న వర్షాలకు వాగులు పొంగిపొర్లటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని దస్రూమాటు వాగు పొంగి పొర్లుతుండడంతో పరిసర గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలోని దయ్యాల వాగు రోడ్డుపౖౖె ఆరు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో నార్లాపూర్, మేడారం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలం కాటాపూర్ సమీపంలోని బోరునర్సాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో బీరెల్లిరంగాపురం మీదుగా పినపాక వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించి పోయాయి.
ఖమ్మంలో ఒకటే వర్షం
ఖమ్మం జిల్లా ఇల్లందు, గుండాల మార్గంలో కిన్నెరసాని, ముర్రేడుతో పాటు పలు వాగులు పొర్లిన ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెంలోని గోధుమవాగు పొంగి పొర్లింది. ఫలితంగా విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచాయి. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు 11 గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతూరు, విఆర్‌పురం మార్గంలో వాగులో చిక్కుకున్న ఇద్దరు చెట్లు ఎక్కి కేకలు వేయడంతో స్థానికులు వారిని రక్షించారు. ఆదిలాబాదు జిల్లా లోకేశ్వరం మండలం బామ్మిలో పిడుగు పడి విద్యార్థిని కుంట శ్రీలత అక్కడికక్కడే చనిపోయింది. మరొక ఎనిమిది మందికిగాయాలయ్యాయి.
జూరాలకు భారీ వరద నీరు- 26 గేట్ల
Page(s):1 2 3