•ఒక్కకేసు కూడా నమోదు కారాదు
•జీరో ర్యాగింగ్ ఏడాదిగా మార్చాలి
•విసిల సదస్సులో గవర్నర్
ర్యాగింగ్‌పై రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల ఛాన్సలర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కన్నెర్ర జేశారు. ర్యాగింగ్‌ను నిరోధించే బాధ్యతను యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లపైనే మోపారు. ర్యాగింగ్ ఎందుకు చేశామా అన్న భయం విద్యార్థుల్లో కలిగే విధంగా శిక్షలు అమలు చేయాలని అన్నారు. ర్యాగింగ్ చేస్తే జీవితంలో భారీ మూల్యం చెల్లిస్తామని ప్రతి ఒక్కరిలో దాని పట్ల అసహ్యం కల్పించాలని చెప్పారు. దీనికి విద్యా సంవత్సరం సస్పెండ్ చేయడం ఒక్కటే సరిపోదని, పదేళ్ళపాటు జైలుశిక్ష వేయాలని చెప్పారు. గురువారం యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్ల సమావేశం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కెసి రెడ్డి అధ్యక్షతన జూబ్లీహాలులో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నరసింహన్ మాట్లాడుతూ ర్యాగింగ్‌కు ఏ ఒక్కరు పాల్పడినా ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని విసిలను ఆదేశించారు. ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై వెనుకంజ వేయవద్దని, ఇక నుంచి ఒక్క కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని, జీరో ర్యాగింగ్ సంవత్సరంగా ఈ ఏడాదిని మార్చాలన్నారు. కాలేజీ ఆవరణతో పాటు హాస్టళ్ళ వద్ద కూడా ర్యాగింగ్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయని, వాటిని అరికట్టే విషయంలో వైస్‌ఛాన్సలర్లు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హాస్టళ్ళలో విజిలెన్స్‌ను పెంచాలని, రాత్రి పది గంటల తర్వాత ఎక్కువగా నిఘా ఉండేటట్లు చూడాలని, ప్రతిరోజూ విసిలు
Page(s):1 2 3 4