•కాకినాడలో ముగిసిన జగన్ ఓదార్పు యాత్ర
•సభకు 28 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు
•నేతలతో రహస్య మంతనాలు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు చేశారు. 'నాలో చాలా ఆవేదనా, ఆందోళన ఉన్నాయి. ఈ సహనం ఎంతకాలం ఉంటుందో తెలీదు. నాపై ప్రేమాభినాలు చూపిన అంబటి రాంబాబు, మాజీ మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరుగుతోంది. వారికి న్యాయం చేయలేకపోతున్నానని బాధ పడుతున్నానన్నారు. తన తండ్రి కోసం చనిపోయిన వారంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారేనని, అయినా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందలేదని చెప్పారు. పైగా ఆ కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పలు రకాలుగా యత్నించారన్నారు. ఓదార్పుకి రాజకీయాలు అంటగట్టారన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు, మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 'ఎవరేమనుకున్నా, చేయాలనుకున్న కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశాన'ని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నుండి సస్పెండయిన అంబటి రాంబాబు, 28 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, అభిమానులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా వైఎస్ జగన్మోహనరెడ్డి
Page(s):1 2