'లగాన్' చిత్ర దర్శకుడు అశుతోష్ గోవార్కర్ మరో ప్రయత్నాన్ని చేస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1930లో జరిగిన చిట్టగాంగ్ తిరుగుబాటు నేపథ్యాన్ని కథావస్తువుగా ఎంచుకున్నారు. ఆ చిత్రానికి 'ఖేలేన్ హమ్ జీ జాన్ సే' అనే పేరు నిర్ణయించారు. 1930 ఏప్రిల్ 18న బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ అప్పటికి చిట్‌గాంగ్‌వీరులు సూర్యసేన్ అతని బృందం దాడిచేసిన నేపథ్యంలో సాగుతుంది. సూర్యసేన్, కల్పనాదత్ , గణేష్‌ఘోష్ తదితర పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. కల్పనాదత్ కోడలు మానిని ఛటర్జీ విస్తృతంగా పరిశోధనలు చేసి తయారు చేసిన 'డూ ఆర్ డై' అనే చారిత్రక గ్రంథం ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు అశుతోష్ గోవర్కర్ తెలిపారు. దీనికి జావెద్‌అక్తర్ గీతాలు రచించగా, సోహైల్‌సేన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముబై, గోవాలలో జరుగుతోంది. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సెట్‌వేసి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్3న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవిభక్త కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి పి.సి.జోషి సతీమణి కల్పనాదత్. ఆమె పాత్రను గ్లామర్ నటి దీపికా పదుకొనె పోషిస్తోంది. సూర్యసేన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అజరు బిజ్లీ, సంజరు బిజ్లీలు సునీతా గోవార్కర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
Page(s):1